ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగులో 2కే రన్
MLG: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు పట్టణంలో మంగళవారం 2కే రన్ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ రన్‌ను జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్, మున్సిపల్ ఛైర్మన్ చింతనిప్పుల చంద్రకళ జెండా ఊపి ప్రారంభించారు. బండారుపల్లి రోడ్డు మీదుగా జీవాంతరావుపల్లి ఎక్స్ రోడ్డు వరకు వెళ్లి తిరిగి ప్రభుత్వ ఆసుపత్రి జంక్షన్ వరకు రన్ కొనసాగింది.