విషాదం.. స్కూల్ గోడ దూకుతూ విద్యార్థి మృతి
PPM: సాలూరు మండలం మామిడిపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక హైస్కూల్ గోడ దూకుతూ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలి ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బొర్రా దిలీప్‌గా గుర్తించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.