యూనిఫైడ్ సర్వేకు ప్రజలు సహకరించాలి: కమిషనర్

యూనిఫైడ్ సర్వేకు ప్రజలు సహకరించాలి: కమిషనర్

KDP: రాష్ట్ర వ్యాప్తంగా యూనిఫైడ్ సర్వే ప్రారంభం కానుందని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు. ఈ సర్వే ద్వారా ప్రజల కుటుంబ, ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ సంబంధ సమాచారాన్ని సేకరించనున్నారు. సుమారు నెల రోజులపాటు ప్రతి ఇంటికి వెళ్లి EKYC ద్వారా సర్వే చేయాల్సి ఉంటుందన్నారు. ఈ సర్వే ద్వారా ప్రభుత్వ పథకాలు అందజేయబడతాయన్నారు.