రేపు నల్గొండలో నర్రా రాఘవరెడ్డి వర్ధంతి
NLG: మాజీ ఎమ్మెల్యే, CPM రాష్ట్ర కమిటీ సభ్యుడు నర్రా రాఘవరెడ్డి వర్ధంతిని రేపు నల్గొండలో నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో నిర్వహిస్తున్నట్లు CPM జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు సకాలంలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.