రూ.60 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు..

రూ.60 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు..

కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇవాళ ఆలమూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద రూ.30 లక్షలతో నూతన భవన నిర్మాణానికి భూమిపూజ, మండల పరిషత్ ఆవరణలో రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించారు. సెటిల్ కోర్టు, ప్రజా దర్బార్ వేదిక కూడా ప్రారంభించారు. 46 మంది డ్వాక్రా యానిమేటర్లకు ఫోన్లు అందజేశారు.