ప్రమాదకరంగా మురుగు డ్రైన్ వంతెన
కోనసీమ: అయినవిల్లి మండలం సిరిపల్లి మురుగు డ్రైన్ వద్ద ఉన్న వంతెన ప్రమాదకరంగా మారిందని స్థానికులు అంటున్నారు. వంతెనకు ఉన్న రక్షణ గోడలు కూలిపోవడంతో విద్యార్దులు ఇబ్బందులు పడుతూ ప్రయాణిస్తున్నారు. అధికారులు కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.