మహిళా పోలీసులకు ఉచిత వైద్య శిబిరం
GNTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం గుంటూరులోని పోలీస్ కళ్యాణ మండపంలో మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. వైద్య శిబిరంలో మహిళా కానిస్టేబుళ్లు, జిల్లా పోలీస్ కార్యాలయ మహిళా సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.