బూడిద మేఘంపై కేంద్రం క్లారిటీ

బూడిద మేఘంపై కేంద్రం క్లారిటీ

ఇథియోపియాలోని హేలీ గుబ్బి అగ్నిపర్వతం పేలడం వల్ల ఏర్పడిన బూడిద మేఘం భారత్ వైపు దూసుకువస్తోంది. దీంతో భారత్‌లోని విమాన సర్వీసులపై భారీ ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ స్పందిస్తూ.. బూడిద మేఘంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పలు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు వెల్లడించింది.