విషాదం.. 11 ఏళ్లకే సూసైడ్

విషాదం.. 11 ఏళ్లకే సూసైడ్

MDCL: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన వెలుగుచూసింది. సుభాష్‌నగర్‌లో నివాసం ఉండే బాలుడు (11) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడు మృతదేహాన్ని పరిశీలించారు. సూసైడ్‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చిన్న వయసులో బాలుడి కఠిన నిర్ణయం స్థానికులను కలచివేసింది.