బీసీ హాస్టల్ ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ

బీసీ హాస్టల్ ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ

ADB: తానూర్ మండలం బోసిలోని బీసీ సంక్షేమ బాలుర హాస్టల్‌ను ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి సందర్శించారు. హాస్టల్ గదులు, పరిసరాలను పరిశీలించారు. రూ.27 లక్షల నిధులతో నిర్మించనున్న హాస్టల్ ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. హాస్టళ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.