VIDEO: కేరళ అంతటి ప్రాధాన్యత కలిగినది ఉండవల్లి..!

GNTR: కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం తర్వాత, ఉండవల్లి గుహాలయాలకు అంతటి ప్రత్యేక స్థానం ఉంది. క్రీ.శ. 420-620 మధ్య విష్ణుకుండినుల కాలంలో ఒకే కొండను నాలుగంతస్తులుగా తొలిచివేసి నిర్మించిన ఈ గుహాల్లో బౌద్ధ, శైవ, వైష్ణవ శిల్పాలు కొలువై ఉన్నాయి. 20 అడుగుల ఏకశిలా అనంతపద్మనాభస్వామి విగ్రహం ఈ ఆలయ ప్రత్యేకత. ఇవి నరసింహస్వామి కొండకు సొరంగ మార్గం కలిగినట్టు చెప్తారు.