VIDEO: పాకల బీచ్‌లో పర్యాటకుల సందడి
ప్రకాశం: సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్‌లో ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు సందడి చేశారు. జిల్లాలోని నలుమూలల నుంచి బీచ్‌కు పర్యాటకులు తరలివచ్చారు. సముద్ర కెరటాల్లో స్నానాలు చేసి ఆనందంగా గడిపారు. చిన్నారులు కెరటాలతో ఇసుక తిన్నెలపై ఆటలాడుకున్నారు. తీరం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.