పెళ్లి కానుకగా రూ. 45 లక్షల విలువ గల చెక్కులు అందజేత
E.G: జగ్గంపేట స్థానిక కాపు సామాజిక భవనంలో జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 224 జంటలకు ఒక్కొక్కరికీ రూ. 20,000 చొప్పున సుమారు రూ. 45 లక్షల విలువ గల చెక్కులు పెళ్లి కానుకగా అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీశాఖ కార్పొరేషన్ ఛైర్మన్ సృజన కృష్ణ రంగారావు, MLA జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పి. రాజశేఖర్ హాజరయ్యారు. కానుక పట్ల నూతన జంటలు కృతజ్ఞతలు తెలిపారు.