ముద్రగడను కలిసిన పిఠాపురం వైసీపీ నేతలు

తూ.గో.జిల్లా: కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడను పిఠాపురం వైసీపీ నాయకులు కలిశారు. ఈ ఎన్నికలు ప్రజల ఎన్నికలు అని, వైసీపీ గెలుపుకోసం కసిగా పని చేయాలని ముద్రగడ పిలుపునిచ్చారు. జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు అందరూ కష్టపడి పని చేయాలన్నారు. తాను కూడా తన శాయశక్తులా కష్టపడుతున్నానంటూ ముద్రగడ పిఠాపురం వైసీపీ నాయకులకు స్పష్టం చేశారు.