'పారిశుద్ధ్య మహిళా కార్మికులు ఎంతో గొప్పవారు'
RR: హోలీ పండుగ సందర్భంగా షాద్‌నగర్ మున్సిపల్ పారిశుద్ధ్య మహిళా కార్మికులకు 12వ వార్డు కౌన్సిలర్ కళ్యాణ్ కార్ దిలీప్ కుమార్ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యం వార్డులో పారిశుద్ధ్య పనులు చేపడుతూ పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న మహిళా కార్మికులు ఎంతో గొప్ప వారిని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేష్, జయంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.