సైబర్ సిటీలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్

HYD: TGSPDCL పరిధిలో గతేడాది 9,862 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదవగా, ఈ ఏడాది 10.48% పెరిగి 11,017 మెగావాట్లకు చేరిందని శనివారం అధికారులు తెలిపారు. సైబర్‌సిటీ సర్కిల్ పరిధిలో డిమాండ్ 33.69% పెరిగిందని వెల్లడించారు. విద్యుత్ వినియోగాన్ని బట్టి ప్రాంతాలను 4 కేటగిరీలుగా విభజించామని, 5,330 ఎంవీఏ సామర్థ్యంతో 410 సబ్‌స్టేషన్లు నిర్మిస్తామన్నారు.