సాక్షాత్తు కలెక్టరే ఫోటోలు డిలీట్ చేసిన పరిస్థితి: జడ్పీ ఛైర్మన్

VZM: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలో ఇవాళ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పోలింగ్ బూత్ పరిశీలనకు వెళ్లిన కలెక్టర్ ఫోటోలను ట్వీట్ చేస్తే.. ఆ ఫోటోలో కూడా ఆయన పక్కనే దొంగ ఓటర్లు ఉన్నారన్నారు. ఈ తప్పిదాన్ని గమనించి ఫోటోలు వెంటనే డిలీట్ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు.