VIDEO: ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

CTR: పుంగునూరులో వైభవంగా జరుగుతున్న శ్రీ కళ్యాణ వేంకటరమణ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. 11 రోజులపాటు ఈ బ్రహ్మోత్సవాలు జరిగాయి. నేడు వైఖానస ఆగమోక్తం ప్రకారం వేద పండితులు ఉదయన్నే శ్రీవారికి సుప్రభాతం, మహాశాంతి అభిషేకం పూజ కైంకర్యాలను చేపట్టారు. అనంతరం తిరుప్పావడ సేవను నిర్వహించారు.