సెప్టెంబర్ 7 నుంచి జిల్లా స్థాయి యోగా పోటీలు

ఏలూరు: జిల్లా స్థాయి యోగా ఛాంపియన్ షిప్ పోటీలు సెప్టెంబర్ 7 నుంచి ఆగిరిపల్లిలోని శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని మడుపల్లి రామ నాగలక్ష్మి నారాయణరావు - కస్తూరిల కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొద్దూరు సాంబశివరావు మంగళవారం తెలిపారు. ఆసక్తి గలవారం 9490335122 ఈ నంబర్‌ను సంప్రదించాలన్నారు.