ప్రమాదకరంగా మారిన కల్వర్టులు
E.G: సీతానగరం మండలం పరిధిలోని పురుషోత్తపట్నం, తొర్రిగడ్డ ప్రాజెక్టు ప్రాంతాల్లో కల్వర్టులు ప్రమాదకరంగా మారాయి. రామచంద్రపురం, వంగలపూడి, సింగవరం సహా 12 చోట్ల రక్షణ గోడలు కూలిపోయాయి. దీంతో రైతులు పంటలను తరలించడంలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాద భయంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.