వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొన్న MLA
జగిత్యాల పట్టణంలోని మినీ స్టేడియంలో జరుగుతున్న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమంలో MLA డా. సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ మేరకు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీఎం కప్ ఎడిషన్-2 టార్చ్ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ పాల్గొన్నారు.