విడదల గోపికి రిమాండ్ పొడిగింపు

విడదల గోపికి రిమాండ్ పొడిగింపు

PLD: మాజీ మంత్రి విడదల రజని మరిది విడదల గోపి రిమాండ్‌ను ఏసీబీ కోర్టు ఈనెల 22 వరకు పొడిగించింది. గురువారం అధికారులు గోపిని పల్నాడు జిల్లా కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎడ్లపాడు శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.