బురదమయంగా సిరిపల్లి పంచాయతీ రోడ్డు

బురదమయంగా సిరిపల్లి పంచాయతీ రోడ్డు

కోనసీమ: అయినవిల్లి మండలం సిరిపల్లి పంచాయతీ రోడ్డుకి మోక్షం ఎప్పుడు కలుగుతుందా అని గ్రామస్తులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్న నాయకులు, అధికారులు రోడ్డును పట్టించుకోవడం లేదు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డు బురదమయంగా తయారయింది. పంచాయతీకి, పాఠశాలకు ఈ రోడ్డులోనే వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.