పదో తరగతి విద్యార్థుల హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్
E.G: కూటమి ప్రభుత్వం పదో తరగతి విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సౌకర్యార్థం హాల్ టికెట్స్‌పై క్యూఆర్ కోడ్ పొందుపరిచింది. దానిని స్కాన్ చేసి పరీక్ష కేంద్రం చిరునామా, చేరుకోవడానికి పట్టే సమయాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. దీంతో పరీక్షా కేంద్రాల వద్దకు సకాలంలో చేరుకోవచ్చు. కాగా.. ఈనెల 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి.