'255 పశువులకు గాలికుంటు టీకాలు'
KNR: శంకరపట్నం మండలంలోని మక్త, ముత్తారం గ్రామాల్లో సర్పంచులు మహేష్, రాజయ్య ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 255 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు వైద్యా ధికారి డాక్టర్ మాధవరావు తెలిపారు. టీకాలతో పశుసంపదను రక్షించుకోవచ్చని సర్పంచులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, గోపాలమిత్రులు రైతులు పాల్గొన్నారు.