ఆ హక్కు భారత్‌కు ఉంది: రష్యా
సార్వభౌమ దేశమైన భారత్‌కు తనకు నచ్చిన దేశాల నుంచి ముడి చమురును కొనుగోలు చేసే హక్కు ఉంటుందని రష్యా వెల్లడించింది. భారత్.. తన దేశ ప్రజల ప్రయోజనాల కోసం లాభదాయకమైన చోటే ఇంధన కొనుగోళ్లు చేస్తుందని చెప్పింది. ఆ స్వేచ్ఛ భారత్‌కు ఎప్పుడూ ఉంటుందని తెలిపింది. ఇకమీదట సైతం రష్యా నుంచే భారత్ చమురు కొనుగోళ్లు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.