సాయి డెంటల్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే
SKLM: పాత పట్టణంలో ఆధునిక వైద్య సదుపాయాలతో సాయి డెంటల్ క్లినిక్‌ను పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు క్లినిక్ ఉపయోగపడుతుందన్నారు. ప్రజల దంత ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ క్లినిక్ ముఖ్యపాత్ర పోషిస్తుందన్నారు. వైద్యులు, నాయకులు పాల్గొన్నారు.