చిలకలూరిపేటలో కొత్త పుష్‌కార్టుల పంపిణీ

PLD: చిలకలూరిపేటలో శనివారం పది లక్షల విలువైన 15 కొత్త పుష్ కార్టులను శానిటేషన్ కార్మికులకు మాజీ మంత్రి పుల్లారావు అందజేశారు. మరో పుష్ కార్టుల కొనుగోలు ప్రక్రియలో ఉందని కమిషనర్ శ్రీహరి బాబు తెలిపారు. పారిశుద్ధ్య వనరులు పెంచుతున్నామని, ప్రజలు మున్సిపల్ వాహనాలకే చెత్త ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ చిలకలూరిపేట లక్ష్యంగా అందరూ కలిసిరావాలని కోరారు.