తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారంకు చెందిన దోర్నాల రాములు అకాల మరణం చెందారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో, పెద్ద కూతురు రమాదేవి తండ్రికి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. మిగిలిన సోదరీమణులు రజిని, విజయ, కల్పనలు కూడా పాల్గొని భావోద్వేగానికి లోనయ్యారు. కూతురే తండ్రికి కర్మలు నిర్వహించడం చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు.