కోదండ రాముడి హుండీ ఆదాయం ఎంతంటే..?
KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయం హుండీ ఆదాయాన్ని TTD అధికారులు, శ్రీవారి సేవకులు గురువారం లెక్కించారు. గత నెల 17 నుంచి భక్తులు సమర్పించిన కానుకలు రూ. 29,11,005లు వచ్చినట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. తొలుత రంగ, ముఖ మండపం, భక్త సంజీవరాయస్వామి ఆలయంలో హుండీలను పరిశీలించి, విజిలెన్స్ అధికారుల సమక్షంలో తెరిచి మదింపు చేపట్టారు.