'ఉపాధ్యాయులకు పదోన్నతులతో బదిలీలు చేయాలి'
JGL: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులతో కూడిన బదిలీలు చేపట్టాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ అన్నారు. రాయికల్ మండల కేంద్రంలో ఆదివారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.