బాధిత కుటుంబాలకి అండంగా ఉంటాం: ఎస్పీ
ADB: అనారోగ్యంతో మృతి చెందిన ఇచ్చోడ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎం. నాగేశ్వరరావు కుటుంబానికి ప్రభుత్వం తరపున కార్పస్ ఫండ్ నుండి లక్ష రూపాయల చెక్కును ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం అందజేశారు. బాధిత కుటుంబాలకి పోలీసుల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సురేందర్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.