VIDEO: ఐనవోలు మల్లన్న జాతర తేదీలు ఖరారు
HNK: ఐనవోలు మండల కేంద్రంలో జరిగే మల్లన్న జాతర ఈ నెల 13న ప్రారంభమవుతుందని ఆదివారం ఈవో సుధాకర్ తెలిపారు. జనవరి 14న భోగి, 15న మకర సంక్రాంతి బండ్ల తిరుగుడు, 16న కనుమ దర్శనాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1న అన్నదానం, ఫిబ్రవరి 15న విశేష పూజలు, మార్చి 15న ప్రత్యేక అర్చనలు జరగనున్నాయి. మార్చి 19న ఊరేగింపుతో జాతర మహా ముగింపు ఉత్సవం జరుగుతుంది.