భావన్నారాయణస్వామి ఆలయ ఈవోగా శ్రీనివాసరావు

భావన్నారాయణస్వామి ఆలయ ఈవోగా శ్రీనివాసరావు

KKD: రూరల్ సర్పవరంలోని శ్రీ భావన్నారాయణస్వామి ఆలయ ఈవోగా ఆర్. శ్రీనివాసరావు నియమితులయ్యారు. గురువారం ఆయన ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. వాడపల్లి దేవస్థానం సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆయనకు గ్రేడ్-1 ఈవోగా పదోన్నతి ఇచ్చారు. మొదట పట్టిసీమకు ఈవోగా నియమించగా, సాంకేతిక సమస్య కారణంగా సర్పవరానికి బదిలీ చేశారు.