VIDEO: అగ్ని ప్రమాదంలో రూ.6 లక్షల నష్టం

VIDEO: అగ్ని ప్రమాదంలో రూ.6 లక్షల నష్టం

NZB: బోధన్ పట్టణంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎదురుగా ఉన్న ముబిన్‌కు చెందిన ఆయిల్, ఆటో మొబైల్ షాపులో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వేసవి కాలం కావడంతో మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ఎంతో కష్టపడ్డారు. ఈ ప్రమాదంలో షాపులోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ. 6 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందని అగ్నిమాపక అధికారి సుభాష్ తెలిపారు.