'రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలి'

'రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలి'

ప్రకాశం: సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్‌ను ఒంగోలులోని 39వ డివిజన్ అమరావతి నగర్‌కు చెందిన మహిళలు సోమవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీలో రోడ్లు, సైడ్ కాలువలు లేక అవస్థలు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి వారు తీసుకెళ్లారు. త్వరలో సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు చేపడతామని మహిళలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.