అనుమానాస్పద స్థితిలో రిమాండ్ ఖైదీ మృతి

WGL: నర్సంపేట పట్టణంలోని మహిళా సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పెండ్యాల సుచరిత, గురువారం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితురాలైన సుచరితను ఈ నెల 13న సబ్ జైలుకు తరలించినట్లు జైలర్ తెలిపారు.