సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్దాం: కలెక్టర్

సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్దాం: కలెక్టర్

NZB: సర్దార్​ సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్దామని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా వినాయక్​నగర్​లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పోరాట యోధుడు పాపన్నగౌడ్ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని వివరించారు.