శారదా నగర్‌లో 945 ఇళ్లకు భూమి పూజ
సత్యసాయి: మంత్రి సత్య కుమార్ ధర్మవరం పట్టణంలోని శారదా నగర్‌లో ఇటీవల మంజూరైన 945 గృహాలకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) ద్వారా ప్రతి పేద కుటుంబం సొంత ఇల్లు కలిగి గౌరవప్రదమైన జీవితం గడపాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసిందని వివరించారు.