మరో 10 రోజుల వరకు దాడులు చేయం: ట్రంప్
హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌కు అమెరికా మరింత సమయం ఇచ్చింది. మరో 10 రోజుల సమయం ఇస్తున్నామని అప్పటి వరకు ఇరాన్ ఇంధన కేంద్రాలపై ఎలాంటి దాడులు చేయబోమని తెలిపారు. ఈ సందర్భంగా టెహ్రాన్‌తో శాంతి చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని వెల్లడించారు. చర్చలపై కొన్ని వార్త పత్రికలు తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.