సచివాలయ సిబ్బంది పనితీరుపై సంతృప్తి

VZM: గజపతినగరం గ్రామ సచివాలయం సిబ్బంది పనితీరుపై పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం కమిషనర్ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. సమిత్వ సర్వేతో పాటు ఇంటి పన్ను వసూలు అన్ని రంగాలను నిశితంగా పరిశీలించి సంతృప్తి చెందారు. ఇందులో జడ్పీ సీఈవో సత్యనారాయణ, డిప్యూటీ సీఈవో వెంకటరమణ, ఇంఛార్జ్ ఎంపీడీవో పుష్పలత పాల్గొన్నారు.