గాంధీ ఆసుపత్రిలో వ్యక్తి ఆత్మహత్య
HYD: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. యాదగిరిగుట్ట వంగపల్లికి చెందిన నరేందర్(37) అప్పుల బాధ భరించలేక DEC 1న పురుగుమందు తాగాడు. కుటుంబసభ్యులు గాంధీలో చేర్చగా, ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి ఇవాళ తెల్లవారు జామున 3వ ఫ్లోర్‌లోని ఎమర్జెన్సీ బ్లాక్ బాత్రూం కిటికీ నుంచి దూకి మృతిచెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI రాకేష్ తెలిపారు.