అకాల వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం

అకాల వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం

NRPT: నవాబ్‌పేట మండల కేంద్రంలో ఆదివారం కురిసిన అకాల వర్షానికి మార్కెట్‌ యార్డులోని వరిధాన్యం తడిసి అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగించింది. సాయంత్రం అకస్మాత్తుగా వర్షం కురవడంతో ఆరబెట్టిన ధాన్యం మొత్తం తడిసి ముద్దయ్యింది. కొంత మంది రైతుల ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది.