‘వేముగోడులోనే రైతు సేవా కేంద్రం కొనసాగించాలి’
KRNL: వేముగోడులోని రైతు సేవా కేంద్రాన్ని పుట్టపాశం గ్రామానికి తరలించడం అన్యాయమని, వేముగోడులోనే కొనసాగించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జీ. రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. వేముగోడు జనాభా, రైతుల సంఖ్య ఎక్కువగా ఉండగా కేంద్రాన్ని తరలించడం సరైంది కాదని తెలిపారు.