కాలేజీల్లో విద్యార్థుల అర్ధాకలి

కాలేజీల్లో విద్యార్థుల అర్ధాకలి

NLG: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఉత్తమాటగానే మారింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న వారిలో ఎక్కువగా పేద, మధ్యతరగతి విద్యార్థులే ఉన్నారు. వీరిలో 80శాతం మంది గ్రామాల నుంచి కళాశాలలకు వస్తున్నారు. చాలా మంది విద్యార్ధులకు ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే పరిస్థితి లేకుండా రోజంతా పస్తులతో ఉంటున్నారు.