ఫుడ్ పాయిజన్ కేసులపై మంత్రి ఆరా
నంద్యాల పట్టణం బుడగ జంగం కాలనీ, వైఎస్ఆర్ నగర్ కాలనీల్లోని ఫుడ్ పాయిజన్ కేసులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరా తీశారు. ప్రస్తుతం మూడు ఆసుపత్రుల్లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు మంత్రికి వివరించారు. అయితే, పెళ్లిలో మిగిలిన ఆహారాన్ని పంచిపెట్టగా, అది తిని ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రిపాలు అయిన సంగతి తెలిసిందే.