అధికారులతో సమావేశం నిర్వహించిన మెప్మా పీడీ
NLR: మొంథా తుఫాన్ నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాళెం మండలంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మండల స్పెషల్ ఆఫీసర్ మెప్మా పీడీ లీలారాణి మంగళవారం మండలంలో పర్యటించారు. తాహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో వెంకటేశ్వర్లు, కమిషనర్ బాలకృష్ణతో సమావేశమయ్యారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.