'సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి'

'సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి'

KMM: కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా చేపట్టనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకుల పిలుపునిచ్చారు. ఖమ్మంలోని సంజీవరెడ్డి భవన్‌లో ఐఎన్టీయూసీ నగర అధ్యక్షులు నరాల నరేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష కార్మిక సంఘాల సంయుక్త సమావేశంలో పలువురు మాట్లాడారు.