గోకులం షెడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

అన్నమయ్య: గోవుల సంరక్షణ కోసం, పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా గోకులం షెడ్లను నిర్మిస్తున్న ఘనత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌దేనని ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు. గురువారం చిట్వేల్ మండలంలోని కే.కందులవారిపల్లి పంచాయతీ బాలాజినగర్లో నూతనంగా నిర్మించిన గోకులం షెడ్డును ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రారంభించారు.