ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
HYD: కంటోన్‌మెంట్‌లోని మోండా డివిజన్ పరిధిలోని చాపల బావి ప్రాంతంలోని సెకండ్ బజార్‌లో కాంగ్రెస్ డివిజన్ నాయకులు బద్రీనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి ఖర్చు భరించలేని పేద ప్రజలకు ఈ ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని చెప్పుకొచ్చారు.